Monday, November 21, 2022

Infertility

 


INFERTILITY  is an ultimate punishment in some people's life .

Let we discuss about the best solutions  about the topic.

There is a way to adjust life style / by changing food habbits / with some yoga and meditaions / or with some simple ayurvedic medicines that you can prepare your self.

As i can understand the pain and suffering of the problem , i want to suggest for free of cost.

I am writing this blog because 2 of my friends got children with the simple medicines i prepared .
one became pregnant after 17 years . and another after 10 years. 

I am happy to share this message . and i want to help atleast some people. 

please write to smadhuri.a@gmail.com

i will complete the blog with all information soon.

Friday, May 28, 2021

why Coronaa!!!!

                    WHY CORONA!!


It is our resposibility to think that why CORONA came and attacked to human race ....


Please think for 10 minutes....


why first time we are facing OXYGEN defficiency .

where are our big GREEN TREES ... 

Why we are living in CONCRETE MULTI STORIED BUILDINGS

HOW can we live without trees. . .

 please think my dear friends ....


DO SOMETHING ...

PLANT  TREES ...

MAKE THIS EARTH AGAIN GREEN.. 

THAT IS THE SOLUTION FOR SO MANY PROBLEMS . . . 

FOR OUR FUTURE GENERATIONS . 


It is true that humans are killing every animal upto that species extinction.

So Many Species of Animals which are the part of this Creation NO WHERE today.

They have their own purpose in this World.

Now for CORONA VIRUS - HUMAN RACE became the only option to ATTACK.....


NO NEED TO ACCEPT MY WORDS 

BUT PLEASE THINK YOUR SELF

IS IT TRUE OR NOT

IS IT OUR MAKING OR NOT

IS IT RESULT OF OUR IRRESPONSIBLE LIFE STYLE AGAINST MOTHER EARTH . . OR AGAINST THIS ENTIRE NATURE..


PLEASE THINK YOURSELF.


Wednesday, March 12, 2014

happy healing - telugu















శరీరము లో కలిగే అనేక వ్యాధులకు కారణం - మనిషి మనసు , ఆలోచన విధానం అని ఒప్పుకోక తప్పదు .
మనసు - తన  సహజ స్తితి ఐన ప్రశాంత, ఆనంద స్తితి ని వదిలి ,విపరీతమైన మానసిక సంఘర్షణ ల పాలు కావడం వలన మానవ జాతి  అంతు  చిక్కని వ్యాధుల బారిన పడుతుంది .

మృదువైన పుష్పాల నుండి తీయబడి - సున్నితమైన మనసుపై పని చేసి అనేక వ్యాధులను పూర్తిగా తగ్గించి సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించే సహజ సిద్దమైన  చికిత్సా విధానమే  - డాక్టర్ . ఎడ్వర్డ్ బాచ్ గారు కనుగొన్న -
బాచ్ పూల మందుల చికిత్స .

మానసిక స్తితి ని బట్టి ఈ మందులు వాడడం వలన శరీరం లో వున్నా వ్యాధులు కూడా సర్దు బాటు అవుతాయి. 


మొత్తం మందులు 38 కాబట్టి ఎవరికి వారు  తెలుసుకుని వాడుకోడం వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు .

మానసిక లక్షణాలను బట్టి 38 మందులను 7 వర్గాలుగా విభజించవచ్చు


1. భయము ఆందోళన : mimulus, aspen , cherry plum ,rock rose , red chest nut .

2.అనిశ్చితత్వం /ఊగిసలాట : cerato ,scleranthus gentian ,gorse , horn beam , wild oat .

3. శ్రద్ద లేకపోవడం : clematis , honey suckle , olive , wild rose,white chestnut,mustard,chest nut bud .

4.ఒంటరి తనము  : water violet ,impatiens , heather .

5.అతి సున్నితత్వము : agrimony, centaury , wall nut , holly.

6.నిరాస ,నిస్పృహ : larch  ,pine  ,elm , sweet chest nut  ,star of bethleham , willow , oak , crab apple

7. ఇతరుల గురించి అతి జాగ్రత్త / అతి ఆలోచన  : chicory, vervain , beech ,vine ,rock water

                                            1.భయము 

mimulus : నిత్య జీవనము లో కలుగు  నిర్దిష్టమైన తెలిసిన భయములు - వ్యాధి వలన ,నొప్పి వలన, పేదరికము వలన , ఏదైనా జంతువు , లేదా వస్తువు వలన కలుగు భయము - వీరు మనసులోని భయములను ఎవరికీ చెప్పుకోరు. అటు వంటి పరిస్తితి లో ఈ మందు పని చేసి - శరీరం లో వున్నా బాధలు కూడా తగ్గుతాయి .

aspen : అర్ధము లేని అకారణమైన అస్పష్టమైన భయములు . విపరీతమైన ఆందోళనకు గురి అవుతారు కాని ఎందుకో తెలియదు . కారణం వివరించలేరు. ఏదో కీడు జరుగుతుందని భయము .

cherry plum :  విపరీతముగా అలిసిపోయిన వారు, తప్పు చేసి భయపడు  పనులు చెయ్యడం వలన , తప్పు అని తెలిసినా చెయ్యకుండా ఉండలేని వారు , తమ ఉద్రేకాల మీద అదుపుతప్పుతారని భయము . తన పనుల మీద మెదడు అదుపు తప్పునని భయము .

rock rose :  ప్రమాదము, అనారోగ్యము వంటివి జరిగినప్పుడు - ఎటువంటి ఆస లేనప్పుడు - విపరీతమైన భయము ఆందోళన కలిగినప్పుడు ఈమందును  వుపయోగించి ఫలితమును పొందవచ్చు

red chest nut : తన వారికి ఏదో కీడు జరుగుతుంది అని విపరీతమైన ఆందోళన తో వుంటారు . ఆ పరిస్తితులలో ఈ మందు ప్రశాంతత ను కలిగిస్తుంది .

                                             2.  అనిశ్చితత్వము /ఊగిసలాట 


cerato :  తమ మీద తమకు నమ్మకం లేకుండుట , అనుమానం , తెలివితక్కువ తనము . సొంత నిర్ణయములు తీసుకోలేని వారు .  ప్రతి చిన్న విషయానికి ప్రక్క వారి మీద ఆధారపడే వారికి ఈ మందు మంచి ఫలితాలను ఇస్తుంది

scleranthus : రెండు విషయముల మద్య ఊగిసలాట జరుగుతూ వుంటుంది . . కాసేపు అటు కాసేపు ఇటు ఊగుతూ వుంటారు .నిర్నయము తీసుకోలేరు . వీరు తమ బాధలను ఎవరికీ చెప్పుకోరు . మౌనం గ భరిస్తారు.ఎవరిని సలహాలు అడగరు . చెప్పినా వినరు

gentian : తొందరగా అధైర్య పడతారు . ఉత్సాహం గ మొదలు పెట్టిన పని లో చిన్న అడ్డంకులు ఎదురైనా నీరు కారిపోతారు . ముందుకు వెళ్ళలేరు

gorse :  విపరీతమైన అపనమ్మకము తో వుంటారు . ఆశలన్నీ వదులుకుని వుంటారు .

hornbeam : రోజు వారి పనులు చేసుకునుటకు తమకు తగినంత శారీరక మానసిక శక్తి లేదని .. బాధ పడుతూ వుంటారు . ఇంకా శక్తి కలగడం వల్లనే పనులను తేలిగ్గా చేసుకోవచ్చు అని ఊహిస్తూ వుంటారు .

wild oat :  జీవితం లో ఏదో సాధించాలనే గట్టి పట్టుదల తో వుంటారు కాని ఏమి చెయ్యాలో తెలియని సందిగ్ధం లో వుంటారు. వారికి తృప్తి ని కలిగించు వృత్తి ని గురించి సరైన నిర్ణయం చెయ్యలేరు
 
                                   3. శ్రద్ధ లేకపోవడం / బద్దకము 

clematis :  ఉపేక్ష చేయడం , అశ్రద్ద , వర్తమానం లో ఉత్సాహం వుండదు ,సూన్య దృష్టి , పరధ్యానము ,పగటి కలలు  కంటూ , మత్తు లో జోగుతూ దిమ్ముగా వుంటారు . రాబోయే కాలం గురించి కలలు కంటూ గడిపేస్తారు . అనారోగ్యం కలిగిన కూడా - ఆరోగ్యం కోసం ఎలాంటి ప్రయత్నమూ చెయ్యక మరణం కోసం ఎదురు చూస్తూ వుంటారు .

honeysuckle : పూర్తిగా గతించిపోయిన కాలం గురించి , అప్పట్లో వున్నా ఆనందం లేదా అప్పుడు కలిసి వున్నా మనుషుల గురించి ఆనందాన్ని  తలుచుకుంటూ బ్రతికేస్తారు

wild rose :   ఉదాసీనత ,జీవితాన్ని యధాతధం గ స్వీకరిస్తారు . బాగు చేసుకోడానికి కానీ ఆనందం గ ఉండటానికి - ఎంత మాత్రమూ కృషి చెయ్యరు . జీవితానికి పూర్తిగా లొంగిపోయి ఎలాంటి సొంత ఆలోచనలు  లేకుండా గడిపేస్తారు

olilve : శారీరకం గ కాని మానసికం గ కాని  విపరీతం గ అలిసిపోయి వుంటారు . ఏ పని చెయ్యలేని విధం గ నిత్య జీవితం కష్టం గ ఎలాంటి ఆనందం లేకుండా వుంటుంది .

white chest nut :   తమ ఆలోచనలను, సంభాషణలను, మానసిక వాదనలను నియంత్రించుకోలేరు . తమ ప్రమేయము లేకనే ఉపయోగము లేని ఆలోచనలు గిర గిర రింగు తిరిగినట్టుగా మనసులో తిరుగుతూ వుంటాయి .

mustard : కారణము లేకుండా క్రుంగిపోవడం , ఉన్నట్టుంది ఆవరించె చింత .
అకస్మాత్తుగా ఊహించని దుక్కము - మేఘము కమ్మినట్టు ఆవరిస్తుంది . కారణము వుండదు .  ఈ పరిస్తితి కొద్ది గంటలు రోజులు వారలు లేదా నెలలు వుండి వచ్చినట్టే పోతుంది

chest nut bud : అశ్రద్ద , పరిశీలనా లేకపోడం , చేసిన తప్పునే మరల మరల చేయడం , పాత తప్పుల నుండి నేర్చుకోకపోవడం , తప్పించుకుని తిరిగే స్వభావం కలవారు . చెప్పిందే మరల మరల చెప్తూ వుంటారు. వీరు వర్తమానం లోనే జీవిస్తూ వుంటారు . మనసులో ఎలాంటి ఆలోచనలు నిండి వుండవు .

                                       4. ఒంటరి తనము 

water violet :  గర్వమును కలిగి వుంటారు . ఏకాంతం గ ఉండటానికి ఇష్టపడతారు . తక్కువ మాట్లాడతారు . ఇతర విషయములలోకి తల దూర్చరు . తమ అనరోగ్యమును గురించి ఎవరికీ చెప్పరు . మౌనం గ బాధ పడతారు
impatiens :   వీరు కూడా ఒంటరిగా వుండాలని కొరుదురు . ప్రతి విషయాన్నీ వేగముగా చెయ్యగలరు . వేచి ఉండలేరు . తక్షణ నిర్ణయాలను తీసుకుంటారు వీరు బాగా సమర్ధ వంతులు . తమ పనులను తొందరగా చేయుదురు . ఇతరులు నిదానముగా పని చెయ్యడం సహించలేరు . అసహనము . తీవ్ర మానసిక ఒత్తిడి . quick reaction .

heather :  స్వార్ధమును కలిగి వుంటారు . తన గురించి తానూ చూసుకుంటూ వుంటారు . తమ కష్టాలు ఇతరులకి చెప్పి బరువు తగ్గించుకున్తరు. ఇతరుల కష్టములు వినరు. తమ చుట్టూ వున్నా వాళ్ళను పట్టి ఉంచుకుని తమ బాధలను అతిశయోక్తులుగా అతిగా వివరించి చెప్పుకుంటూ వుంటారు .

                                  5. అతి సున్నితత్వము 

agrimony :  బయటకు ఆనందముగా వుంటారు అందరిని నవ్విస్తూ వుంటారు . లోపల మాత్రమూ మానసిక హింస ను అనుభవిస్తూ వుంటారు . ఇతరులకు తమ కష్టాలు చెప్పరు . డాక్టర్ దగరకు కూడా వెళ్ళరు . మానసిక బాధలను మరిచి పోవుటకు త్రాగుడు మాదక ద్రవ్యములకు అలవాటు పడతారు . బాధ భరించలేక దిండులో తల దూర్చి ఏడుస్తూ వుంటారు

centaury  :weekness of will  . బలహీనమైన సంకల్పము . ఇతరుల ప్రాబల్యానికి లోబడి వుంటారు . పిరికి వారు . దేనికీ వాదించారు . ఎవరు ఏమి చెప్పిన వింటారు . తను చేసే పనికి ప్రతి ఫలము ఆశించారు . చదువు పెళ్లి - లాంటి ఏ విషయము లోని స్వతంత్ర నిర్ణయము తీసుకోరు . భార్య పిల్లల మాట ప్రకారం నడుచుకుంటారు . ఆఫీసు లో పక్కన వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకు వెళ్లి పని చేస్తూ వుంటారు .
వీరు బాల్యములో విపరీతమైన అణచివేతకు గురి ఐన వారు కావచ్చు .

wallnut : జీవితములో జరుగు మార్పులకు సున్నితముగా వుంటారు . దంతాలు ఊడటం , వయసు మారడం , menopause ,జాబు మారుతున్నప్పుడు , విదేశాలకు వెళ్ళడం , ఇల్లు వదిలి వెళ్ళడం ,పెళ్లి , విడాకులు ,ప్రసవము, ఆల్కహాల్ సిగిరెట్టు వంటివి అలవాట్లను మానుకోడానికి  - ఈ మందు (link breaker ) మానసిక సంఘర్షణ నుండి బయట వేయును .

holly : ఓర్వలేని తనము (jealousy ), అనుమానము , ఈర్ష్య , అసహ్యము ,పగ తీర్చుకొనుట .
బాచ్ పూల మందుల్లో ఇది ముక్యమైన మందు , ప్రతిదీ తనకే కావాలనే కోరిక నుండి holly రక్షిస్తుంది . చిన్న పిల్లలలో కూడా - కొత్త బిడ్డ పుట్టినప్పుడు , లేదా స్కూల్ లో కాని ఇంట్లో కాని ప్రక్క పిల్లల మీద అసూయా చెందుతున్నప్పుడు ఈ మందు మంచి మార్పును కలిగిస్తుంది .

                                     6. నిరాస / నిస్పృహ 

larch : ఆత్మా విశ్వాసము లేకపోవడం , ఓటమి కోసం ఎదురు చూడటం , నిరాస , తాను తక్కువనే భావన
దేని కోసము గట్టిగ ప్రయత్నం చేయరు . ఏ పనీ అసలు మొదలు పెట్టడానికి సుముఖం గ వుండరు .
ఈ వ్యక్తులు స్వతహా గ ఎక్కువ శక్తి వంతులు . సగటు మనిషి కన్నా శారీరకం గ మానసికం గ బలవంతులు . ఎవరికీ తక్కువ కారు . ఆ విషయము చుట్టూ వున్నా వారు గుర్తించగలుగుతారు కాని . వారు మాత్రం నమ్మరు .

elm : బాధ్యతల వల్ల విసిగిపోవడం , నిరాస అలిసిపోవడం . బాధ్యతా యుతమైన వృత్తులలో వున్నా వాళ్ళకి బాగా పని చేస్తుంది . మినిస్టర్స్ , ప్రిన్సిపాల్ , మేనేజర్ , ఇంజనీర్స్, లీడర్స్ , మొదలైన వ్యక్తుల నిర్ణయాలు వేలాది మందిని నడిపిస్తూ వుంటాయి . ఇలాంటి వారు . నిరంతరం బరువు బాధ్యతలను మోసి మోసి - ఉన్నట్టుండి నిరాస చెంది నీరస పడుతూ వుంటారు . ఈ లక్షణములు తాత్కాలికము . అటువంటి వారికి ఈ మందు అద్భుతం గ పని చేస్తుంది .

pine :  ఆత్మ నింద, అపరాధ భావము . జరగరానిది ఏదైనా జరిగినా , ఆఫీసు కు ఆలస్యం ఐన . తనను తానూ విపరీతం గ నిందించుకుంటూ వుంటారు .ఆ రూట్ లో కాకుండా ఇంకో వైపు వెళ్ళవలసింది అని ఆలోచిస్తారు . తమకు సంబంధము లేని విషయములకు కూడా తామే కారణం అని  అనుకుంటూ వుంటారు. ప్రపంచములో తామే అధ్వాన్నమైన వ్యక్తీ గ ఊహించుకుంటూ వుంటారు

sweet chest nut :  తీవ్ర మనో వేదన , నిరాశ .భయపెట్టే మానసిక మనోవేదన . ఉదాహరణకు : తుఫాన్ వలన అస్తులన్ని పోవడం , జీతం అంతా దొంగ వాడు కాజేయ్యడం ,బయట ఊరు వెళ్ళినప్పుడు నిలువు దోపిడీ కి గురి అవ్వడం లాంటి పరిస్తితుల్లో - మనసు దిక్కు తోచని పరిస్తితిలో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా వుంటుంది . అలాంటి పరిస్తితుల్లో ఆత్మ హత్య ప్రయత్నం లాంటివి ఏమి చెయ్యరు .
ఈ మందు వలన పోగొట్టుకున్నవి దొరక్కపొయినను - మానసికం గ బాధల నుండి బయట పడి ప్రశాంతత ను పొందవచ్చు .

star of bethleham :  ఒక వ్యక్తీ ఏదైనా షాక్ (shock )కి గురి ఐనప్పుడు అతని శరీరము , మనస్సు , నాడి వ్యవస్థ కదిలిపోయి ఒక విధమైన మానసిక స్తబ్దత ఏర్పడును . పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు . చుడరానివి చూడటం వలన , ఊహించనివి జరగడం వల్లనా షాక్ కి గురి ఐన మనుషులకు ఈ మందు బాగా పని చేస్తుంది .
శరీరం పై గాయాలు మానిపోయిన మనసులో వున్నా షాక్ తాలూకు భయాన్ని ఈ మందు వలన చాల ఏళ్ళ తరువాత కూడా పోగొట్టుకోవచ్చు

willow : ఆగ్రహము ,రోషము , కటినత కలిగి వుంటారు . ఈ వ్యక్తులు తమ దురదృష్టముకు ప్రతి ఒక్కరిని నిందిస్తూ వుంటారు . ఇతరుల విజయాల పట్ల అసూయా చెందుతూ వుంటారు . ఎవరికీ కృతజ్ఞత చెప్పరు . ఒకరి దగ్గర తీస్కోడమే కానీ ఇచ్చుట వుండదు .

 oak : ఆశను వదిలిపెట్టకుండా ఎన్ని విపత్కర పరిస్తితులు వచ్చిన నిరంతరము  పని చేయ్యుదురు . అత్యంత ఆస వాదులు . పేకాటలో ఎన్ని సార్లు ఓడిపోయినా ఇంకా గెలుస్తాననే నమ్మకం తో ఆడుతూనే వుంటారు . గుర్రపు రేస్ లు ఆడే వాళ్ళు ఈ కోవలోకే వస్తారు . ఓటమి ని అంగీకరించరు . . ఈ వ్యక్తులకు పోరాడు ధైర్యము , ఓర్పు , నిలకడ శక్తి సహజ వివేకము మొదలైన లక్షణాలు వుంటాయి .

crab apple :  ఆత్మ ద్వేషము , అసుభ్రతా భావన ,నిరాశ - ఈ మందును శుభ్ర పరచు మందు అంటారు . వీరికి మానసికం గ శారీరకం గ అశుబ్ర భావన ఉంటుంది . వీరు  ఎప్పుడు ప్రతి విషయం లో పరిపూర్ణత ,క్రమ పద్దతి లో వుండాలని కోరుకుంటారు . వస్తువులు అటు ఇటు కాస్త పక్కకి జరిగిన కూడా సహించరు .
లోపల వున్నా కాన్సర్ గురించి ఆందోళన చెందరు కాని , చర్మం మీద వున్నా గజ్జి తామర లను సహించలేరు .


           7. ఇతరుల గురించి అతి ఆలోచన / అతి జాగ్రత్త 

chicory : స్వార్ధము , స్వార్ధ ప్రేమ , అన్ని తమకే కావాలని అనుకోడం , తమ మీద తమకే దయ , తమ మీద శ్రద్ద వుండాలని మరియు తోడూ వుండాలని కోరుట . వీరు ఒంటరిగా ఉండలేరు .
పిల్లలలో - కొత్తగా పుట్టిన చెల్లి లేదా తమ్ముని మీద తల్లి తండ్రులు ప్రేమ చూపించడం సహించలేరు .
తమ అధీనం లోవ్ ఉన్నవారు తమ ఇష్టానుసారం గ నడుచుకోవాలని కొరును .

vervain : అమిత ఉత్సాహము , అనితం గ కష్టపడడం , టెన్షన్ , ఆతురత . ఈ వ్యక్తులు కార్యక్రమాల మీద అతి ఉత్సాహము చుపుసురు . పని చేసినప్పుడు ఆగకుండా చేయుదురు . ఈ ఒత్తిడి కారణం గ విశ్రాంతి లేక నిద్ర పట్టదు . చిన్న పనులకు చాల ఎక్కువ కష్టపడును - గోడలో మేకు కొట్టడానికి అతి పెద్ద సుత్తి ని ఉపయోగిస్తారు

beech:  సహించ కుండుట (intolerance ), ఆజ్ఞాపించడం , ప్రతి చోట క్రమ శిక్షణ గ వుండాలనుకోడం .
ఈ వ్యక్తులు క్రమశిక్షణ , మరియు ప్రతిది క్రమ పద్దతిలో వుండాలని కోరుకుతారు . ఇతరుల కష్టాలను తెలుసుకోకుండా క్రమశిక్షణ కోసం శాసిస్తారు .

vine :  అధికారము , dictator , నిర్దయులు , సర్వదికారం కోరుత , వున్నత స్తితి ని కోరుట . ఇతరుల మీద అధికారం చేలయించాలి అనేది అభిప్రాయం వుండును . అధికారం కోసం క్రురం గ మారుతారు . ఎవరైనా వ్యతిరేకించిన అహం దెబ్బ తింటుంది .

rock rose : అత్యంత భయము ,నిద్ర లో భయము , అకస్మాత్తుగా వచ్చే ప్రక్రుతి విలయాలు జరిగిన పిమ్మట కలిగే విపరీతమైన భయము . దీని వలన వణుకు ,చెమట, అపస్మారకము , చెముడు , మూగపోవుట ,పక్ష వాతము కలుగును .
******************************************************************************


ఈ మందులను ఎవరికీ వారు సొంతం గ నిర్ణయించుకుని వాడుకోవచ్చును .

homoeo షాప్ లందు దొరుకుతాయి .
మీ ఆరోగ్య సమస్యల కోసం smadhuri.a@ gmail .com కు మెయిల్ పంపవచ్చును.

కొన్ని వివరణలు ..

1. బెంగ :

ఎవరి మీద ఐన బెంగ గ వున్నా , ఏదైనా వస్తువు మీద బెంగ , స్థలం మార్పు వల్ల కలిగే బెంగ ,పిల్లలకు      పళ్ళు వచ్చేటప్పుడు కలిగే మార్పు ల వల్ల / లేదా ఏ మార్పు వల్ల అయినా కలిగే శారీరక మానసిక బాధలకు  - walnut సరిగ్గా పని చేస్తుంది .


2. భయము :

ఏదైనా ప్రత్యేకమైన వస్తువు  మనిషి లేదా ఏదైనా - దేనికి భయపడుతున్నామో తెలిసినప్పుడు - mimulus 
పని చేస్తుంది .

దేనికి భయపడుతున్నామో తెలియని భయం కలిగినప్పుడు - aspen 

తన బిడ్డలకు లేదా తను ఇష్టపడే వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయము కలిగినప్పుడు
red chest nut అమృతము వలె పని చేస్తుంది .