శరీరము లో కలిగే అనేక వ్యాధులకు కారణం - మనిషి మనసు , ఆలోచన విధానం అని ఒప్పుకోక తప్పదు .
మనసు - తన సహజ స్తితి ఐన ప్రశాంత, ఆనంద స్తితి ని వదిలి ,విపరీతమైన మానసిక సంఘర్షణ ల పాలు కావడం వలన మానవ జాతి అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతుంది .
మృదువైన పుష్పాల నుండి తీయబడి - సున్నితమైన మనసుపై పని చేసి అనేక వ్యాధులను పూర్తిగా తగ్గించి సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని ప్రసాదించే సహజ సిద్దమైన చికిత్సా విధానమే - డాక్టర్ . ఎడ్వర్డ్ బాచ్ గారు కనుగొన్న -
బాచ్ పూల మందుల చికిత్స .
మానసిక స్తితి ని బట్టి ఈ మందులు వాడడం వలన శరీరం లో వున్నా వ్యాధులు కూడా సర్దు బాటు అవుతాయి.
మొత్తం మందులు 38 కాబట్టి ఎవరికి వారు తెలుసుకుని వాడుకోడం వలన ఆరోగ్యాన్ని పొందవచ్చు .
మానసిక లక్షణాలను బట్టి 38 మందులను 7 వర్గాలుగా విభజించవచ్చు
1. భయము ఆందోళన : mimulus, aspen , cherry plum ,rock rose , red chest nut .
2.అనిశ్చితత్వం /ఊగిసలాట : cerato ,scleranthus gentian ,gorse , horn beam , wild oat .
3. శ్రద్ద లేకపోవడం : clematis , honey suckle , olive , wild rose,white chestnut,mustard,chest nut bud .
4.ఒంటరి తనము : water violet ,impatiens , heather .
5.అతి సున్నితత్వము : agrimony, centaury , wall nut , holly.
6.నిరాస ,నిస్పృహ : larch ,pine ,elm , sweet chest nut ,star of bethleham , willow , oak , crab apple
7. ఇతరుల గురించి అతి జాగ్రత్త / అతి ఆలోచన : chicory, vervain , beech ,vine ,rock water
1.భయము
mimulus : నిత్య జీవనము లో కలుగు నిర్దిష్టమైన తెలిసిన భయములు - వ్యాధి వలన ,నొప్పి వలన, పేదరికము వలన , ఏదైనా జంతువు , లేదా వస్తువు వలన కలుగు భయము - వీరు మనసులోని భయములను ఎవరికీ చెప్పుకోరు. అటు వంటి పరిస్తితి లో ఈ మందు పని చేసి - శరీరం లో వున్నా బాధలు కూడా తగ్గుతాయి .aspen : అర్ధము లేని అకారణమైన అస్పష్టమైన భయములు . విపరీతమైన ఆందోళనకు గురి అవుతారు కాని ఎందుకో తెలియదు . కారణం వివరించలేరు. ఏదో కీడు జరుగుతుందని భయము .
cherry plum : విపరీతముగా అలిసిపోయిన వారు, తప్పు చేసి భయపడు పనులు చెయ్యడం వలన , తప్పు అని తెలిసినా చెయ్యకుండా ఉండలేని వారు , తమ ఉద్రేకాల మీద అదుపుతప్పుతారని భయము . తన పనుల మీద మెదడు అదుపు తప్పునని భయము .
rock rose : ప్రమాదము, అనారోగ్యము వంటివి జరిగినప్పుడు - ఎటువంటి ఆస లేనప్పుడు - విపరీతమైన భయము ఆందోళన కలిగినప్పుడు ఈమందును వుపయోగించి ఫలితమును పొందవచ్చు
red chest nut : తన వారికి ఏదో కీడు జరుగుతుంది అని విపరీతమైన ఆందోళన తో వుంటారు . ఆ పరిస్తితులలో ఈ మందు ప్రశాంతత ను కలిగిస్తుంది .
2. అనిశ్చితత్వము /ఊగిసలాట
cerato : తమ మీద తమకు నమ్మకం లేకుండుట , అనుమానం , తెలివితక్కువ తనము . సొంత నిర్ణయములు తీసుకోలేని వారు . ప్రతి చిన్న విషయానికి ప్రక్క వారి మీద ఆధారపడే వారికి ఈ మందు మంచి ఫలితాలను ఇస్తుంది
scleranthus : రెండు విషయముల మద్య ఊగిసలాట జరుగుతూ వుంటుంది . . కాసేపు అటు కాసేపు ఇటు ఊగుతూ వుంటారు .నిర్నయము తీసుకోలేరు . వీరు తమ బాధలను ఎవరికీ చెప్పుకోరు . మౌనం గ భరిస్తారు.ఎవరిని సలహాలు అడగరు . చెప్పినా వినరు
gentian : తొందరగా అధైర్య పడతారు . ఉత్సాహం గ మొదలు పెట్టిన పని లో చిన్న అడ్డంకులు ఎదురైనా నీరు కారిపోతారు . ముందుకు వెళ్ళలేరు
gorse : విపరీతమైన అపనమ్మకము తో వుంటారు . ఆశలన్నీ వదులుకుని వుంటారు .
hornbeam : రోజు వారి పనులు చేసుకునుటకు తమకు తగినంత శారీరక మానసిక శక్తి లేదని .. బాధ పడుతూ వుంటారు . ఇంకా శక్తి కలగడం వల్లనే పనులను తేలిగ్గా చేసుకోవచ్చు అని ఊహిస్తూ వుంటారు .
wild oat : జీవితం లో ఏదో సాధించాలనే గట్టి పట్టుదల తో వుంటారు కాని ఏమి చెయ్యాలో తెలియని సందిగ్ధం లో వుంటారు. వారికి తృప్తి ని కలిగించు వృత్తి ని గురించి సరైన నిర్ణయం చెయ్యలేరు
3. శ్రద్ధ లేకపోవడం / బద్దకము
clematis : ఉపేక్ష చేయడం , అశ్రద్ద , వర్తమానం లో ఉత్సాహం వుండదు ,సూన్య దృష్టి , పరధ్యానము ,పగటి కలలు కంటూ , మత్తు లో జోగుతూ దిమ్ముగా వుంటారు . రాబోయే కాలం గురించి కలలు కంటూ గడిపేస్తారు . అనారోగ్యం కలిగిన కూడా - ఆరోగ్యం కోసం ఎలాంటి ప్రయత్నమూ చెయ్యక మరణం కోసం ఎదురు చూస్తూ వుంటారు .
honeysuckle : పూర్తిగా గతించిపోయిన కాలం గురించి , అప్పట్లో వున్నా ఆనందం లేదా అప్పుడు కలిసి వున్నా మనుషుల గురించి ఆనందాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తారు
wild rose : ఉదాసీనత ,జీవితాన్ని యధాతధం గ స్వీకరిస్తారు . బాగు చేసుకోడానికి కానీ ఆనందం గ ఉండటానికి - ఎంత మాత్రమూ కృషి చెయ్యరు . జీవితానికి పూర్తిగా లొంగిపోయి ఎలాంటి సొంత ఆలోచనలు లేకుండా గడిపేస్తారు
olilve : శారీరకం గ కాని మానసికం గ కాని విపరీతం గ అలిసిపోయి వుంటారు . ఏ పని చెయ్యలేని విధం గ నిత్య జీవితం కష్టం గ ఎలాంటి ఆనందం లేకుండా వుంటుంది .
white chest nut : తమ ఆలోచనలను, సంభాషణలను, మానసిక వాదనలను నియంత్రించుకోలేరు . తమ ప్రమేయము లేకనే ఉపయోగము లేని ఆలోచనలు గిర గిర రింగు తిరిగినట్టుగా మనసులో తిరుగుతూ వుంటాయి .
mustard : కారణము లేకుండా క్రుంగిపోవడం , ఉన్నట్టుంది ఆవరించె చింత .
అకస్మాత్తుగా ఊహించని దుక్కము - మేఘము కమ్మినట్టు ఆవరిస్తుంది . కారణము వుండదు . ఈ పరిస్తితి కొద్ది గంటలు రోజులు వారలు లేదా నెలలు వుండి వచ్చినట్టే పోతుంది
chest nut bud : అశ్రద్ద , పరిశీలనా లేకపోడం , చేసిన తప్పునే మరల మరల చేయడం , పాత తప్పుల నుండి నేర్చుకోకపోవడం , తప్పించుకుని తిరిగే స్వభావం కలవారు . చెప్పిందే మరల మరల చెప్తూ వుంటారు. వీరు వర్తమానం లోనే జీవిస్తూ వుంటారు . మనసులో ఎలాంటి ఆలోచనలు నిండి వుండవు .
4. ఒంటరి తనము
water violet : గర్వమును కలిగి వుంటారు . ఏకాంతం గ ఉండటానికి ఇష్టపడతారు . తక్కువ మాట్లాడతారు . ఇతర విషయములలోకి తల దూర్చరు . తమ అనరోగ్యమును గురించి ఎవరికీ చెప్పరు . మౌనం గ బాధ పడతారు
impatiens : వీరు కూడా ఒంటరిగా వుండాలని కొరుదురు . ప్రతి విషయాన్నీ వేగముగా చెయ్యగలరు . వేచి ఉండలేరు . తక్షణ నిర్ణయాలను తీసుకుంటారు వీరు బాగా సమర్ధ వంతులు . తమ పనులను తొందరగా చేయుదురు . ఇతరులు నిదానముగా పని చెయ్యడం సహించలేరు . అసహనము . తీవ్ర మానసిక ఒత్తిడి . quick reaction .
heather : స్వార్ధమును కలిగి వుంటారు . తన గురించి తానూ చూసుకుంటూ వుంటారు . తమ కష్టాలు ఇతరులకి చెప్పి బరువు తగ్గించుకున్తరు. ఇతరుల కష్టములు వినరు. తమ చుట్టూ వున్నా వాళ్ళను పట్టి ఉంచుకుని తమ బాధలను అతిశయోక్తులుగా అతిగా వివరించి చెప్పుకుంటూ వుంటారు .
5. అతి సున్నితత్వము
agrimony : బయటకు ఆనందముగా వుంటారు అందరిని నవ్విస్తూ వుంటారు . లోపల మాత్రమూ మానసిక హింస ను అనుభవిస్తూ వుంటారు . ఇతరులకు తమ కష్టాలు చెప్పరు . డాక్టర్ దగరకు కూడా వెళ్ళరు . మానసిక బాధలను మరిచి పోవుటకు త్రాగుడు మాదక ద్రవ్యములకు అలవాటు పడతారు . బాధ భరించలేక దిండులో తల దూర్చి ఏడుస్తూ వుంటారు
centaury :weekness of will . బలహీనమైన సంకల్పము . ఇతరుల ప్రాబల్యానికి లోబడి వుంటారు . పిరికి వారు . దేనికీ వాదించారు . ఎవరు ఏమి చెప్పిన వింటారు . తను చేసే పనికి ప్రతి ఫలము ఆశించారు . చదువు పెళ్లి - లాంటి ఏ విషయము లోని స్వతంత్ర నిర్ణయము తీసుకోరు . భార్య పిల్లల మాట ప్రకారం నడుచుకుంటారు . ఆఫీసు లో పక్కన వాళ్ళ ఫైల్స్ కూడా తీసుకు వెళ్లి పని చేస్తూ వుంటారు .
వీరు బాల్యములో విపరీతమైన అణచివేతకు గురి ఐన వారు కావచ్చు .
wallnut : జీవితములో జరుగు మార్పులకు సున్నితముగా వుంటారు . దంతాలు ఊడటం , వయసు మారడం , menopause ,జాబు మారుతున్నప్పుడు , విదేశాలకు వెళ్ళడం , ఇల్లు వదిలి వెళ్ళడం ,పెళ్లి , విడాకులు ,ప్రసవము, ఆల్కహాల్ సిగిరెట్టు వంటివి అలవాట్లను మానుకోడానికి - ఈ మందు (link breaker ) మానసిక సంఘర్షణ నుండి బయట వేయును .
holly : ఓర్వలేని తనము (jealousy ), అనుమానము , ఈర్ష్య , అసహ్యము ,పగ తీర్చుకొనుట .
బాచ్ పూల మందుల్లో ఇది ముక్యమైన మందు , ప్రతిదీ తనకే కావాలనే కోరిక నుండి holly రక్షిస్తుంది . చిన్న పిల్లలలో కూడా - కొత్త బిడ్డ పుట్టినప్పుడు , లేదా స్కూల్ లో కాని ఇంట్లో కాని ప్రక్క పిల్లల మీద అసూయా చెందుతున్నప్పుడు ఈ మందు మంచి మార్పును కలిగిస్తుంది .
6. నిరాస / నిస్పృహ
larch : ఆత్మా విశ్వాసము లేకపోవడం , ఓటమి కోసం ఎదురు చూడటం , నిరాస , తాను తక్కువనే భావన
దేని కోసము గట్టిగ ప్రయత్నం చేయరు . ఏ పనీ అసలు మొదలు పెట్టడానికి సుముఖం గ వుండరు .
ఈ వ్యక్తులు స్వతహా గ ఎక్కువ శక్తి వంతులు . సగటు మనిషి కన్నా శారీరకం గ మానసికం గ బలవంతులు . ఎవరికీ తక్కువ కారు . ఆ విషయము చుట్టూ వున్నా వారు గుర్తించగలుగుతారు కాని . వారు మాత్రం నమ్మరు .
elm : బాధ్యతల వల్ల విసిగిపోవడం , నిరాస అలిసిపోవడం . బాధ్యతా యుతమైన వృత్తులలో వున్నా వాళ్ళకి బాగా పని చేస్తుంది . మినిస్టర్స్ , ప్రిన్సిపాల్ , మేనేజర్ , ఇంజనీర్స్, లీడర్స్ , మొదలైన వ్యక్తుల నిర్ణయాలు వేలాది మందిని నడిపిస్తూ వుంటాయి . ఇలాంటి వారు . నిరంతరం బరువు బాధ్యతలను మోసి మోసి - ఉన్నట్టుండి నిరాస చెంది నీరస పడుతూ వుంటారు . ఈ లక్షణములు తాత్కాలికము . అటువంటి వారికి ఈ మందు అద్భుతం గ పని చేస్తుంది .
pine : ఆత్మ నింద, అపరాధ భావము . జరగరానిది ఏదైనా జరిగినా , ఆఫీసు కు ఆలస్యం ఐన . తనను తానూ విపరీతం గ నిందించుకుంటూ వుంటారు .ఆ రూట్ లో కాకుండా ఇంకో వైపు వెళ్ళవలసింది అని ఆలోచిస్తారు . తమకు సంబంధము లేని విషయములకు కూడా తామే కారణం అని అనుకుంటూ వుంటారు. ప్రపంచములో తామే అధ్వాన్నమైన వ్యక్తీ గ ఊహించుకుంటూ వుంటారు
sweet chest nut : తీవ్ర మనో వేదన , నిరాశ .భయపెట్టే మానసిక మనోవేదన . ఉదాహరణకు : తుఫాన్ వలన అస్తులన్ని పోవడం , జీతం అంతా దొంగ వాడు కాజేయ్యడం ,బయట ఊరు వెళ్ళినప్పుడు నిలువు దోపిడీ కి గురి అవ్వడం లాంటి పరిస్తితుల్లో - మనసు దిక్కు తోచని పరిస్తితిలో ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా వుంటుంది . అలాంటి పరిస్తితుల్లో ఆత్మ హత్య ప్రయత్నం లాంటివి ఏమి చెయ్యరు .
ఈ మందు వలన పోగొట్టుకున్నవి దొరక్కపొయినను - మానసికం గ బాధల నుండి బయట పడి ప్రశాంతత ను పొందవచ్చు .
star of bethleham : ఒక వ్యక్తీ ఏదైనా షాక్ (shock )కి గురి ఐనప్పుడు అతని శరీరము , మనస్సు , నాడి వ్యవస్థ కదిలిపోయి ఒక విధమైన మానసిక స్తబ్దత ఏర్పడును . పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు . చుడరానివి చూడటం వలన , ఊహించనివి జరగడం వల్లనా షాక్ కి గురి ఐన మనుషులకు ఈ మందు బాగా పని చేస్తుంది .
శరీరం పై గాయాలు మానిపోయిన మనసులో వున్నా షాక్ తాలూకు భయాన్ని ఈ మందు వలన చాల ఏళ్ళ తరువాత కూడా పోగొట్టుకోవచ్చు
willow : ఆగ్రహము ,రోషము , కటినత కలిగి వుంటారు . ఈ వ్యక్తులు తమ దురదృష్టముకు ప్రతి ఒక్కరిని నిందిస్తూ వుంటారు . ఇతరుల విజయాల పట్ల అసూయా చెందుతూ వుంటారు . ఎవరికీ కృతజ్ఞత చెప్పరు . ఒకరి దగ్గర తీస్కోడమే కానీ ఇచ్చుట వుండదు .
oak : ఆశను వదిలిపెట్టకుండా ఎన్ని విపత్కర పరిస్తితులు వచ్చిన నిరంతరము పని చేయ్యుదురు . అత్యంత ఆస వాదులు . పేకాటలో ఎన్ని సార్లు ఓడిపోయినా ఇంకా గెలుస్తాననే నమ్మకం తో ఆడుతూనే వుంటారు . గుర్రపు రేస్ లు ఆడే వాళ్ళు ఈ కోవలోకే వస్తారు . ఓటమి ని అంగీకరించరు . . ఈ వ్యక్తులకు పోరాడు ధైర్యము , ఓర్పు , నిలకడ శక్తి సహజ వివేకము మొదలైన లక్షణాలు వుంటాయి .
crab apple : ఆత్మ ద్వేషము , అసుభ్రతా భావన ,నిరాశ - ఈ మందును శుభ్ర పరచు మందు అంటారు . వీరికి మానసికం గ శారీరకం గ అశుబ్ర భావన ఉంటుంది . వీరు ఎప్పుడు ప్రతి విషయం లో పరిపూర్ణత ,క్రమ పద్దతి లో వుండాలని కోరుకుంటారు . వస్తువులు అటు ఇటు కాస్త పక్కకి జరిగిన కూడా సహించరు .
లోపల వున్నా కాన్సర్ గురించి ఆందోళన చెందరు కాని , చర్మం మీద వున్నా గజ్జి తామర లను సహించలేరు .
7. ఇతరుల గురించి అతి ఆలోచన / అతి జాగ్రత్త
chicory : స్వార్ధము , స్వార్ధ ప్రేమ , అన్ని తమకే కావాలని అనుకోడం , తమ మీద తమకే దయ , తమ మీద శ్రద్ద వుండాలని మరియు తోడూ వుండాలని కోరుట . వీరు ఒంటరిగా ఉండలేరు .
పిల్లలలో - కొత్తగా పుట్టిన చెల్లి లేదా తమ్ముని మీద తల్లి తండ్రులు ప్రేమ చూపించడం సహించలేరు .
తమ అధీనం లోవ్ ఉన్నవారు తమ ఇష్టానుసారం గ నడుచుకోవాలని కొరును .
vervain : అమిత ఉత్సాహము , అనితం గ కష్టపడడం , టెన్షన్ , ఆతురత . ఈ వ్యక్తులు కార్యక్రమాల మీద అతి ఉత్సాహము చుపుసురు . పని చేసినప్పుడు ఆగకుండా చేయుదురు . ఈ ఒత్తిడి కారణం గ విశ్రాంతి లేక నిద్ర పట్టదు . చిన్న పనులకు చాల ఎక్కువ కష్టపడును - గోడలో మేకు కొట్టడానికి అతి పెద్ద సుత్తి ని ఉపయోగిస్తారు
beech: సహించ కుండుట (intolerance ), ఆజ్ఞాపించడం , ప్రతి చోట క్రమ శిక్షణ గ వుండాలనుకోడం .
ఈ వ్యక్తులు క్రమశిక్షణ , మరియు ప్రతిది క్రమ పద్దతిలో వుండాలని కోరుకుతారు . ఇతరుల కష్టాలను తెలుసుకోకుండా క్రమశిక్షణ కోసం శాసిస్తారు .
vine : అధికారము , dictator , నిర్దయులు , సర్వదికారం కోరుత , వున్నత స్తితి ని కోరుట . ఇతరుల మీద అధికారం చేలయించాలి అనేది అభిప్రాయం వుండును . అధికారం కోసం క్రురం గ మారుతారు . ఎవరైనా వ్యతిరేకించిన అహం దెబ్బ తింటుంది .
rock rose : అత్యంత భయము ,నిద్ర లో భయము , అకస్మాత్తుగా వచ్చే ప్రక్రుతి విలయాలు జరిగిన పిమ్మట కలిగే విపరీతమైన భయము . దీని వలన వణుకు ,చెమట, అపస్మారకము , చెముడు , మూగపోవుట ,పక్ష వాతము కలుగును .
******************************************************************************
ఈ మందులను ఎవరికీ వారు సొంతం గ నిర్ణయించుకుని వాడుకోవచ్చును .
homoeo షాప్ లందు దొరుకుతాయి .
మీ ఆరోగ్య సమస్యల కోసం smadhuri.a@ gmail .com కు మెయిల్ పంపవచ్చును.
కొన్ని వివరణలు ..
1. బెంగ :
ఎవరి మీద ఐన బెంగ గ వున్నా , ఏదైనా వస్తువు మీద బెంగ , స్థలం మార్పు వల్ల కలిగే బెంగ ,పిల్లలకు పళ్ళు వచ్చేటప్పుడు కలిగే మార్పు ల వల్ల / లేదా ఏ మార్పు వల్ల అయినా కలిగే శారీరక మానసిక బాధలకు - walnut సరిగ్గా పని చేస్తుంది .
2. భయము :
ఏదైనా ప్రత్యేకమైన వస్తువు మనిషి లేదా ఏదైనా - దేనికి భయపడుతున్నామో తెలిసినప్పుడు - mimulus
పని చేస్తుంది .
దేనికి భయపడుతున్నామో తెలియని భయం కలిగినప్పుడు - aspen
తన బిడ్డలకు లేదా తను ఇష్టపడే వారికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయము కలిగినప్పుడు
red chest nut అమృతము వలె పని చేస్తుంది .
